No Headline
● వాజేడు మండల పరిధి నాగారంలో మల్లెల దేవి ఇంటిపై నుంచి పెంకులు కిందపడ్డాయి. పేరూరులోని సీడబ్ల్యూసీ కార్యాలయ భవనం గోడలకు 5 చోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. చీ కుపల్లిలో ఓ ఇంటి గోడకు బీటలు వారడంతో పాటు గోడ పెచ్చులు ఊ డిపడ్డాయి. మిర్చి తోటల్లో ఉన్న రైతుల ఎదురుగా రోడ్డుపై ఉన్న బైక్‌లు ఊగినట్లు కావడంతో తోటల్లో నుంచి బయటకు పరుగులు తీశారు.
● ఏటూరునాగారం మండలంలోని శంకరాజుపల్లికి చెందిన ఆత్కూరి నేతాజీ ఇంటిగోడ పడిపోయింది. అలాగే ఏటూరునాగారం 2వ వార్డులోని మాటూరి చంద్రకళ ఇంటి గోడలు కూలిపోయాయి.
● గోవిందరావుపేట మండల పరిధి రాంనగర్ మాన్యతండాలో భూమి కంపించడంతో ఇళ్లలోని వస్తువులు కిందపడ్డాయి. దీంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చిన ప్రజలు చాలా సేపటివరకు ఇళ్లలోకి వెళ్లలేదు.
● మహబూబాబాద్ జిల్లా కేసముద్రంస్టేషన్‌లో రెండు ఇళ్లలో గోడలకు పగుళ్లు వచ్చాయి.
● జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని ఆదర్శ కాలనీలో ఆత్మకూరి కుమార్‌యాదవ్ ఇంటి ఆవరణలో గల మరుగుదొడ్డి స్వల్పంగా ఒక పక్కకు కుంగిపోయింది.
● వరంగల్ నగరంలో భూమి కదిలినట్లు అనిపించడంతో భయాందోళనకు గురయ్యారు.
● జనగామ జిల్లాకేంద్రంలోని జీఎంఆర్ కాలనీలో గోడకు పగుళ్లు వచ్చాయి.
భయాందోళనకు గురైన ప్రజలు
Comments
Please login to add a commentAdd a comment