‘భద్రకాళి’ అంచున ఆదిమానవులు?
సాక్షిప్రతినిధి, వరంగల్ : చారిత్రక నేపథ్యం కలిగిన వరంగల్ నగరంలోని భద్రకాళి చెరువు చుట్టూ అనేక రహస్యాలు, విశేషాలు వెలుగుచూస్తున్నాయి. వేలాది ఏళ్లుగా ఆది మానవులు, అనేక రాజవంశాలు, ఆధ్యాత్మిక పరులు మొదలుకొని నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడిని ఎదుర్కుంటున్న ఆధునిక మానవులను ఈ చెరువు ఆకర్షిస్తున్నది. ఇదే తరుణంలో 50 ఏళ్ల తర్వాత భద్రకాళి చెరువులో పూడిక తీత పనులు చేపట్టేందుకు నీటిపారుదలశాఖ నీటిని ఖాళీ చేసింది. దీంతో పరిశోధకుల దృష్టి చెరువులోని గుట్టలపై పడింది. బుధవారం ఈ చెరువుపై పరిశోధన జరిపిన డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి భద్రకాళి చెరువు, చెరువు చుట్టూ ఉన్న గుట్టల సౌందర్యం వర్ణణాతీతమని చెప్పొకొచ్చాడు. భద్రకాళి చెరువు అంచున ఆదిమానవులు జీవించిన గుహలు, చెరువు మధ్యలో ద్వీపంలా ఉండే గుట్టపై రాతి పనిముట్ల పరిశ్రమ, బృహత్ శిలాయుగం నాటి సమాధులు, కాకతీయుల నాటి సైనికులు కోట వెనుక నుంచి రహస్య మార్గం గుండా వచ్చి చెరువులోకి దిగడానికి వీలుగా ఉన్న మెట్ల మార్గాలను ప్రతాప్, హేమంతులతో కలిసి చారిత్రక ఆధారాలను గుర్తించినట్లు రత్నాకర్ రెడ్డి వెల్లడించారు.
జీవనం సాగించినట్లు ఆధారాలు లభ్యం
చారిత్రక ఆధారాలకు సాక్ష్యం..
భద్రకాళి చెరువు తీరం
చెరువు మధ్యలో ద్వీపంలా గుట్ట..
రాతి పనిముట్ల పరిశ్రమ ఆనవాళ్లు
పూడికతీత పనుల కోసం చెరువు ఖాళీ..
బయటపడుతున్న రహస్యాలు
పురావస్తుశాఖ సమగ్ర సర్వే చేస్తే మరిన్ని
విశేషాలు : డిస్కవరీమ్యాన్ రెడ్డి రత్నాకర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment