ఎంపీడీఓల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఆంజనేయులు
హన్మకొండ అర్బన్: తెలంగాణ మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీఓల) సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పరకాల ఎంపీడీఓగా పని చేస్తున్న పెద్ది ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా హసన్‌పర్తి ఎంపీడీఓ జూలూరు ప్రవీణ్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు హనుమకొండ జిల్లా పరిషత్ సీఈఓ ఎం.విద్యాలత తెలిపారు. బుధవారం జరిగిన సంఘం జిల్లా నూతన కమిటీ ఎన్నికల్లో ఉపాధ్యక్షులుగా ఎం.శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారిగా నందం విజయకుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రామడుగు లక్ష్మీ ప్రసన్న, కార్యవర్గ సభ్యులుగా గుండె బాబు, కమటం అనిల్‌కుమార్‌ను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. ఈనూతన కార్యవర్గం మూడేళ్ల పాటు ఉంటుందని వివరించారు. ఈసందర్భంగా జెడ్పీ సీఈఓ విద్యాలత మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల అభివృద్ధిలో ఎంపీడీఓల పాత్ర చాలా కీలకమని అందరూ కష్టపడి పని చేసి జిల్లాను ఉన్నత స్థాయిలో నిలపాలని కోరారు. నూతన అధ్యక్షుడు అంజనేయులు మాట్లాడుతూ.. ఎన్నికలను సహృద్భావ వాతావరణంలో సజావుగా నిర్వహించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ.. జిల్లా అభివృద్ధి అందరం కష్టపడి పనిచేద్దామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ బి.రవి, ఎంపీడీఓలు ఫణిచంద్ర, శ్రీనివాస్, వీరేశం, జెడ్పీ కార్యాలయ పర్యవేక్షకులు రాంబాబు, సునిల్, రామ్మోహన్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment