రిపబ్లిక్ డే పరేడ్‌కు కేడెట్లు
కేయూ క్యాంపస్: న్యూఢిల్లీలో జరగబోయే రిపబ్లిక్ డే పరేడ్‌కు హనుమకొండ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఎన్‌సీసీ కేడెట్లు బి.ప్రశాంత్, ఎం.భావన, కె.నివేదిక, దినేశ్ ఎంపికయ్యారు. వీరిని బుధవారం ఆకళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి అభినందించారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ అధికారులు లెఫ్టినెంట్ డాక్టర్ స్వామి, ఫ్లయింగ్ ఆఫీసర్ బి.ప్రసాద్, డాక్టర్ నెహదా, డాక్టర్ గిరిప్రసాద్ పాల్గొన్నారు.
సీపీని కలిసిన
హెడ్‌కానిస్టేబుళ్లు
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి వివిధ పోలీస్‌స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 1996 బ్యాచ్‌కు చెందిన 19 మంది కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందారు. ఈసందర్భంగా పదోన్నతి పొందిన పలువురు బుధవారం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. సీపీని కలిసిన వారిలో హెడ్‌కానిస్టేబుళ్లు అశోక్, బాబు, స్వామి, దామోదర్ ఉన్నారు.
క్షయ వ్యాధిగ్రస్తులకు
చేయూతనందించాలి
ఎంజీఎం: క్షయ వ్యాధిగ్రస్తులకు చేయూతనందించాలని వరంగల్ డీఎంహెచ్‌ఓ సాంబశివరావు అన్నారు. జిల్లా క్షయ నివారణ సంస్థ సిబ్బంది బుధవారం తమ సొంత ఖర్చులతో వ్యాధిగ్రస్తులకు పోషకాహారం అందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎంహెచ్‌ఓ సాంబశివరావు పలువురు వ్యాధిగ్రస్తులకు పోషకాహార ప్యాకెట్లను పంపిణీ చేసి సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ సంస్థ అధికారి, కార్యాలయ సిబ్బంది ప్రభాకర్, రంజిత్, వేణుగోపాల్, నరేశ్, మాధవి, సుభాషిని, సంకీర్తన, నరేశ్, అశోక్, పాల్గొన్నారు.
రేపు ఉమ్మడి జిల్లా
నిరుద్యోగులకు జాబ్‌మేళా
కాళోజీ సెంటర్: ఉమ్మడి జిల్లా నిరుద్యోగ యువతీయువకులకు ములుగు రోడ్డు సమీపంలోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయంలో శుక్రవారం జాబ్‌మేళా నిర్వహిస్తునట్లు వరంగల్ జిల్లా ఉపాధి కల్పన అధికారి సీహెచ్.ఉమారాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభంకానున్న జాబ్‌మేళాకు అర్హత, ఆసక్తిగలవారు విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 70931 68464 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment