ఇక చెత్తకు చెక్!
వరంగల్ అర్బన్: నగరాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో పారిశుద్ధ్యం మొదటిది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి అధికారులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాల్ని ఇక్కడా అమలు చేసేందుకు ప్రజాధనం కోట్లు కుమ్మరిస్తున్నారు. అయినప్పటికీ ఆశించిన మేర ఫలితాలు రావడం లేదు. ఈక్రమంలో తాజాగా.. రాష్ట్ర పురపాలక శాఖ అధికారులు గ్రేటర్ నగరంలో లిట్టర్ ఫ్రీ జోన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో బల్దియా ప్రజారోగ్యం అధికారులు నగరవ్యాప్తంగా ప్రధాన రహదారులు, పార్కులు, చెరువులు, పర్యాటక ప్రాంతాలు, జన సామర్థ్యం కలిగి ఉన్న ప్రాంతాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. త్వరలో నోటిఫికేషన్ జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
చెత్త వేస్తే జరిమానా..
లిట్టర్ ఫ్రీ జోన్‌లో భాగంగా ఎవరైనా రోడ్లపై చెత్త, పడేస్తే రూ.500 నుంచి రూ.10 వేల వరకు జరిమానా విధించాలనే నిబంధనలున్నాయి. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం, వ్యాపార, వాణిజ్య షాపుల లైసెన్స్ రద్దు చేయాలని భావిస్తున్నారు. వీటిని కఠినతరం చేస్తుండడంతో పాటు నగరంలోని ప్రధాన రహదారుల్లో కమర్షియల్ భవనాల నుంచి విధిగా వాహనాల ద్వారా రోజువారీగా చెత్తను సేకరించేందుకు సమాయత్తమవుతున్నారు. గతంలో 17 ప్రధాన రహదారులకు సంబంధించిన 44 కిలోమిటర్ల లిట్టర్ ఫ్రీ రోడ్లతో పాటు మరో 6 రహదారులను పరిగణనలోకి తీసుకోనున్నారు. బాధ్యతాయుతంగా క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య కార్మికులు, జవాన్లు, వాహనాల డ్రైవర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు విధులు నిర్వహిస్తే లిట్టర్ ఫ్రీ సిటీ సాధ్యమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బల్దియాకు 40 మంది పర్మనెంట్ ఉద్యోగులు
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు 40 మంది పర్మనెంట్ ఉద్యోగులను కేటాయిస్తూ రాష్ట్ర పురపాలకశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్–4 సెలక్ట్ అయిన వీరికి ఇటీవల పురపాలక శాఖ రీజినల్ డైరెక్టర్ షాహిద్ మసూద్ పోస్టింగ్ ఇ చ్చారు. దీంతో రెండు, మూడు రోజుల్లో విదుల్లో చే రనున్నారు. నలుగురు జూనియర్ అకౌంటెంట్లు, ఆరుగురు జూనియర్ అసిస్టెంట్లు, 30 మంది వార్డు ఆఫీసర్లను కేటాయించారు. కొద్ది నెలల కిందట 38 మంది వీఆర్‌ఓలు, ఆరుగురు వీఆర్‌ఏలు బ ల్దియాకు కేటాయించడంతో, మరికొంత మంది బ ల్దియా పర్మనెంట్ ఉద్యోగులతో కలిపి 66 డివి జ న్లకు వార్డు ఆఫీసర్లను నియమించారు. వీఆర్‌ఓలు, కొత్తగా చేరనున్న వార్డు ఆఫీసర్లతో బల్దియా సాధారణ పరిపాలన విభాగం బలోపేతం కానుంది.
23 లిట్టర్ ఫ్రీ జోన్ల రోడ్లు,
ప్రాంతాల గుర్తింపు
త్వరలో నోటిఫికేషన్
జారీకి సన్నాహాలు
రోడ్లపై చెత్త వేస్తే జరిమానా
ఉత్తర్వులు జారీ చేసిన
రాష్ట్ర పురపాలక శాఖ అధికారులు
Comments
Please login to add a commentAdd a comment