మిరపకు పైపాటు పోషకాలు అందించాలి
హన్మకొండ: చలికి మిరప భూమిలోని పోషకాలు తీసుకోదు. పూత, ఆకులు రాలిపోతాయి. ఈ క్రమంలో పైపాటున పోషకాలు అందించడం ద్వారా పంటను కాపాడుకోవచ్చు. సూక్ష్మ పోషకాలను పంటపై పిచికారీ చేయాలి. మిరప పూత దశలో తామర పురుగులు ఆశిస్తాయి. పూత రాలి దిగుబడి తగ్గుతుంది. పురుగు తీవ్రత, సామూహిక నివారణకు నీలిరంగు జిగురు అట్టలను ఎకరాకు 40–50 వరకు పంటకు ఎత్తులో ఏర్పాటు చేయాలి. రసాయన పురుగు మందులు పిచికారీ చేయొద్దు. వీటికి బదులు ఎన్‌ఎస్‌కేఈ, వేపనూనె, కానుగ నూనె, వావిలి రసం ఇందులో ఏదో ఒకటి లేదా బివేరియా బాిస్సినా, సీడోమోనాస్ ఫ్లోరెన్సెస్, బాసిల్లస్ ఆల్బస్‌లో ఏదో ఒకటి నిర్ణీత మోతాదులో లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. చివరి అస్త్రంగా ఎసిఫేట్ 1.5 లేదా ఇథియాన్ 2.0 లేదా స్పినోసాడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
– చేరాల రాకేశ్,
ఉద్యాన అధికారి(టెక్నికల్), వరంగల్
Comments
Please login to add a commentAdd a comment