జస్టిస్ షమీమ్ అక్తర్‌కు ఘన స్వాగతం
హన్మకొండ : ఎస్సీ వర్గీకరణపై అభిప్రాయ సేకరణ చేపట్టేందుకు బుధవారం హనుమకొండకు చేరుకున్న ఏకసభ్య కమిషన్ చైర్మన్, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌కు అధికారులు ఘనస్వాగతం పలికారు. హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి స్వాగతం పలికారు. నేడు హనుమకొండ కలెక్టరేట్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో ఎస్సీ వర్గీకరణపై వివిధ వర్గాల నుంచి వినతులు, అభిప్రాయాలు స్వీకరించనున్నారు.
ఎస్సీ వర్గీకరణపై నేడు హనుమకొండ
కలెక్టరేట్‌లో అభిప్రాయ సేకరణ
Comments
Please login to add a commentAdd a comment