అంత్యక్రియల్లో అపాయం..
నర్సంపేట : హిందూ సంప్రదాయం ప్రకారం చనిపోయిన వారి అంత్యక్రియల్లో తలకొరివి పెట్టే సమయంలో చితి చుట్టూ చెప్పులు లేకుండా తిరగాల్సి ఉంటుంది. ఈ సమయంలో శ్మశాన వాటికల్లో ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు లేకుండా చూసుకోవాల్సి ఉంది. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఓ బాలికకు అపాయకర పరిస్థితి ఎదురైంది. పుట్టెడు దుఃఖంలో తన తండ్రికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో శ్మశాన వాటికలో ఉన్న గాజు పెంకులు కాళ్లకు గుచ్చుకుని రక్తం చిందించింది. ఈ ఘటన నర్సంపేటలోని వరంగల్ రోడ్డులోని శ్మశానవాటికలో జరిగింది. పట్టణానికి చెందిన లాయర్ బిల్లా రాంరెడ్డి అనారోగ్యంతో మృతి చెందగా బుధవారం అతడి కూతురు సిరి తలకొరివి పెట్టింది. ఈ సమయంలో గాజు పెంకులు కాలికి గుచ్చుకుని రక్తస్రావమైంది. ఓ పక్క తండ్రిని కోల్పోయి కన్నీరుమున్నీరవుతుండగా, మరో పక్క కాలికి సీసా ముక్కలు గుచ్చుకున్నాయి. దీంతో రక్తం చిందించడంతో విలవిలలాడింది. దీనిని చూసిన పట్టణ వాసులు అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మీయులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్న వారికి శ్మశాన వాటికల్లో అపాయకర పరిస్థితులు లేకుండా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని వారు కోరారు. 40వేల జనాభా ఉన్న నర్సంపేట మున్సిపాలిటీలో ఇంత నిర్లక్ష్యంగా శ్మశాన వాటికలు ఉండడం దారుణమని మండిపడ్డారు. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే వెంటనే స్పందించి శ్మశాన వాటికల్లో రక్షణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
కనీస సౌకర్యాలు అంతంత మాత్రమే..
నర్సంపేటలోని శ్మశాన వాటికలో కనీస సౌకర్యాలు అంతంత మాత్రమే ఉన్నాయి. మూత్రశాలలు, నీటి వసతులు, దుస్తులు మార్చుకునే గదులు, విద్యుత్ లైట్లు లేవు.
శ్మశాన వాటికలో గాజు పెంకులు గుచ్చుకుని తలకొరివి పెడుతున్న బాలికకు గాయం
నర్సంపేట శ్మశాన వాటికలో
ప్రమాదకర పరిస్థితి
నొప్పి తీవ్రంగా ఉంది..
మా నాన్నకు తలకొరివి పెడుతున్న సమయంలో చెప్పులు లేకుండా చితి చుట్టూ తిరుగుతుండగా కాలికి గాజు పెంకు లు గుచ్చుకుంది. ఆ నొప్పి భ రించలేకుండా ఉంది. ఇలాంటి పరిస్థితి పునరావృతం కా కుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి.
–బిల్లా సిరి, మృతుడు రాంరెడ్డి కూతురు
Comments
Please login to add a commentAdd a comment