అధిక పన్ను వస్తే అప్పీల్ చేసుకోవాలి
● ఆదాయపు పన్ను శాఖ జాయింట్ కమిషనర్ ముకాంబికీవాన్
వరంగల్ చౌరస్తా : అధిక ఆదాయ పన్ను వస్తే ఆప్పీల్ చేసుకుంటే వివాద్ సీ విశ్వాస్ 2–0 ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని ఆదాయ పన్ను శాఖ జాయింట్ కమిషనర్ మూకాంబికీయన్ తెలిపారు. బుధవారం వరంగల్ స్టేషన్ రోడ్డులోని గాయత్రీ హోటల్‌లో ఆదాయ పన్నుపై అవగాహన జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదాయ పన్నుల విషయంలో వివాదాలు లేకుండా అప్పీల్‌తోపాటు అసెస్‌మెంట్ విధానం ప్రవేశపెట్టిందన్నారు. డిప్యూటీ కమిషనర్ రవి కిరణ్ మాట్లాడుతూ 2020 సంవత్సరంలో 1.48లక్షల మంది అధిక పన్నులపై దరఖాస్తు చేసుకుంటే 54 శాతం కేసులు పరిష్కారించడం ద్వారా భారీ ఎత్తున లబ్ధి చేకూరిందన్నారు. కార్యక్రమంలో ఆ శాఖ అధికారులు మహేందర్, అవినాశ్, ట్యాక్స్ బార్ అధ్యక్షుడు త్రిపురనేని గోపిచంద్, ఐసీఏఐ వరంగల్ చైర్మన్ భాగవాన్, చాంబర్ కామర్స్ కార్యదర్శి వేద ప్రకాశ్, రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు సంపత్ కుమార్, టెక్స్‌టైల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండా నమ:శివాయ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment