చలిగాలి రాకుండా తడకలు ఏర్పాటు చేసుకోవాలి
● పశువులు, గొర్రెలు, మేకలకు తగిన టీకాలు వేయించుకోవాలి
హన్మకొండ: చలికాలంలో పశువులు, గొర్రెలు, మేకల్లో వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తగిన టీకాలు వేయించుకోవాలి. రాత్రి పూట వెచ్చగా ఉండడానికి కరెంట్ బల్బులు ఏర్పాటు చేయాలి. ఇంకా చలి ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తే కొన్ని జంతువులకు హీటర్లు వాడాలి. రాత్రివేళల్లో ఉండే గదుల్లోకి చల్లని గాలి ప్రవేశించకుండా గ్రీన్ నెట్‌లు, కొబ్బరి పీచుతో తయారు చేసిన తట్లతో కప్పు వేయాలి. తడకల ద్వారాలను మూసివేయాలి. రేకులపై కొబ్బరితో తయారుచేసిన పీచు లేదా గడ్డి పరచాలి. పడుకునే ప్రదేశంలో ఎండుగడ్డి పరిచి వెచ్చగా ఉండేలా చేయాలి. అన్ని జంతువులకు తాగడానికి గోరు వెచ్చని నీరు.. అందులో ఎలక్ట్రాల్ ఫౌడర్, దాణాలో ఖనిజ లవణ మిశ్రమాలను(అమైనో ఆసిడ్స్) ప్రతిరోజు కలపాలి. శాకాహార జంతువులకు ఉప్పు గడ్డలు కట్టాలి. వాటిని నాకడం ద్వారా లవణాలు శరీరంలోకి వెళ్లి సమతుల్యత లభిస్తుంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి ఈగలు, దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల వ్యాప్తిని తగ్గించాలి.
– డాక్టర్ సి.హెచ్.ప్రవీణ్‌కుమార్,
వడ్డేపల్లి పశువైద్యాధికారి
Comments
Please login to add a commentAdd a comment