విద్యార్థులు పరిశోధనల్లో రాణించాలి: డీఈఓ
విద్యారణ్యపురి: విద్యార్థులు జీవశాస్త్ర పరిశోధనల్లో రాణించాలని హనుమకొండ డీఈఓ వాసంతి అన్నారు. జీవశాస్త్ర ఫోరం ఆధ్వర్యంలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, వివిధ గురుకులాల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు బుధవారం హనుమకొండలోని రీజినల్ సైన్స్ కేంద్రంలో జిల్లా స్థాయి జీవశాస్త్ర ప్రతిభా పోటీలు నిర్వహించారు. ఈపోటీల ముగింపు సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజేతలకు అబ్దుల్ కలాం ఫౌండేషన్ అందించిన బహుమతులు, సర్టిఫికెట్, జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ ఎ.శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామి, ఫోరం అధ్యక్షుడు డాక్టర్ కె.వాసు, అబ్దుల్ కలాం ఫౌండేషన్ ప్రతినిధి శివనాగేశ్వర్‌రావు, ఫోరం బాధ్యులు బి.సునీత, డాక్టర్ ఎం.సారంగపాణి, సోమలింగం, కృష్ణమూర్తి, ఎ.శ్రీనివాస్‌రెడ్డి, లింగమూర్తి, సంధ్య, శ్రీరామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థులు వీరే..
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న వారిలో కె.అక్షయ్‌రామ్ (జెడ్పీహెచ్‌ఎస్ పంథిని), ఎస్ భరత్ (మోడల్ స్కూల్, కమలాపురం), ఎన్.సిరిచందన (లష్కర్ బజార్ బా లికల ఉన్నత పాఠశాల, హనుమకొండ), ఎన్.సిరి (కేజీబీవీ ఐనవోలు) ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment