విద్యార్థులకు జీవశాస్త్ర ప్రతిభా పరీక్ష
కాళోజీ సెంటర్: వరంగల్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం పదో తరగతి విద్యార్థులకు జిల్లాస్థాయి జీవశాస్త్ర ప్రతిభా పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారి కట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రతిభా పరీక్ష నిర్వహించడం వల్ల బోర్డు పరీక్షల్లో అధిక మార్కులు పొందుతారని తెలిపారు. తెలంగాణ జీవశాస్త్ర ఫోరం జిల్లా, రాష్ట్రస్థాయిలో పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. జిల్లాస్థాయి విజేతలకు ఈనెల 28న రాష్ట్రస్థాయి పరీక్షలు ఉంటాయని వివరించారు. అనంతరం విజేతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రంమలో శంభునిపేట పాఠశాల హెచ్‌ఎం వీర ఉపేందర్, ఫోరం రాష్ట్ర కమిటీ సభ్యులు చల్లా కృష్ణ, ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్, ప్రధాన కార్యదర్శి పరమేశ్వర్, కోశాధికారి రమేశ్, ఉపాధ్యక్షురాలు ధనలక్ష్మి, ఇందిర పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment