ఆర్థిక ప్రగతిలో బ్యాంకర్ల భాగస్వామ్యం అవసరం
● అదనవు కలెక్టర్ సంధ్యారాణి
వరంగల్: జిల్లా ఆర్థిక ప్రగతిలో బ్యాంకర్ల భాగస్వామ్యం, సహకారం అవసరమని వరంగల్ అదనవు కలెక్టర్ సంధ్యారాణి తెలిపారు. కలెక్టరేట్‌లోలో బుధవారం జిల్లాస్థాయి డీసీసీ సమావేశం జరిగింది. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పంట రుణాలకు రూ.1,802.08 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు రూ.1,231 కోట్లు అందించారని వివరించారు. డీఆర్‌ఓ విజయలక్ష్మి, డీసీసీ కన్వీనర్ ఎల్డీఎం యూబీఐ హవేలి రాజు, యూనియన్ బ్యాంకు డీఆర్‌హెచ్ మహేశ్, ఆర్బీఐ ఏజీఎం పల్లవి, నాబార్డ్ ఏజీఎం చంద్రశేఖర్, డీఆర్డీఓ కౌసల్యాదేవి, వ్యవసాయ అధికారి అనురాధ, పశుసంవర్థక శాఖ అధికారి బాలకృష్ణ, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి సురేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment