క్రీడల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
● ఒలింపిక్స్ సంఘం అధ్యక్షుడు అజీజ్‌ఖాన్
వరంగల్ స్పోర్ట్స్: క్రీడాకారుల సంక్షేమం, క్రీడల అభివృద్ధే సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ లక్ష్యమని ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజీజ్‌ఖాన్ అన్నారు. హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహిస్తున్న సీఎం కప్ జిల్లాస్థాయి క్రీడా పోటీలను రెండో రోజు బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా క్రీడాకారులతో కలిసి హాకీ ఆడి సందడి చేశారు. కార్యక్రమంలో హనుమకొండ డీవైఎస్‌ఓ గుగులోతు అశోక్‌కుమార్, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. రెండో రోజు రెజ్లింగ్, బాక్సింగ్, లాన్‌టెన్నీస్, వెయిట్ లిఫ్టింగ్, షూటింగ్, హాకీ, కరాటే, రోయింగ్, స్క్వాష్, అత్యపత్య, పవర్‌లిఫ్టింగ్, సాఫ్ట్‌బాల్, టేబుల్‌టెన్నీస్, సెపక్‌తక్రా, తైక్వాండో క్రీడాంశాలు ఎంపిక పోటీలు జరిగాయి. క్రీడాకారులకు వైద్యపరీక్షలు చేసి మందులు అందించినట్లు డీఎంహెచ్‌ఓ అప్పయ్య తెలిపారు.
బాక్సింగ్ క్రీడాకారుల ఆందోళన
బాక్సింగ్ ఎంపికల వద్ద క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేశారు. బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌కుమార్ పరుష పదజాలంతో దూషిస్తున్నాడని వాపోయారు. 500 గ్రాములు తక్కువగా ఉన్నారని తమను ఎంపికలకు దూరం చేశారని ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన అఖిల్, శ్రీమాన్‌రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయి పోటీలు మరో వారం రోజులు ఉన్నాయని అప్పటిలోపు అరకిలో బరువు సులువుగా పెరగొచ్చని క్రీడాకారులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment