ముళ్ల చెట్లు తొలగించారు
మడికొండ: మడికొండలోని పలు కాలనీల్లో ఏపుగా పెరిగిన ముళ్ల చెట్లు, పిచ్చిమొక్కలను బుధవారం తొలగించారు. సాక్షి దినపత్రిలో బుధవారం ప్రచురితమైన జనావాసాల్లో ముళ్ల చెట్లు అనే కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. ఈమేరకు ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేశారు. దీంతో భూ యజమానులు స్పందించి జేసీబీల సహాయంతో ముళ్ల చెట్లను తొలగించారు. ఈక్రమంలో సాక్షికి, అధికారులకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.
అమ్మవారి సన్నిధిలో కమిషనర్
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని వరంగల్ మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే కుటుంబ సమేతంగా బుధవారం సందర్శించారు. ఈమేరకు ఆమెకు పర్యవేక్షకుడు అద్దంకి విజయ్‌కుమార్, ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు పూర్ణకుంభంతో స్వాగతించారు. అనంతరం కమిషనర్‌కు అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందించి మహాదాశీర్వచనం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment