విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకోవాలి
● వరంగల్ విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్
ఖిలా వరంగల్: విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని జిల్లా విద్యాశాఖ అధికారి మామిడి జ్ఞానేశ్వర్ సూచించారు. వరంగల్ ఉర్సు గుట్ట జంక్షన్‌లోని నాని గార్డెన్‌లో వడుప్సా వరంగల్ డివిజన్ ఆధ్వర్యంలో బొల్లం కనకయ్య అధ్యక్షతన బుధవారం పదో తరగతి పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీఈఓ హాజరై మాట్లాడారు. రతన్‌టాటా లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. లక్ష్యాన్ని ఎంచుకుని క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా చదివితే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. ఎంఈఓలు బత్తుల ప్రసాద్, గంప అశోక్, వడుప్సా ట్రస్మా జిల్లా అధ్యక్షుడు సీహెచ్.నాగార్జున్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు, కోశాధికారి రామ్మూర్తి, సలహాదారులు చంద్రారెడ్డి, ఆర్.రవి, సతీష్, జన్ను విలియమ్స్, సుధీర్, సుధాకర్, విద్యాసాగర్, రాజు, నసీరొద్దీన్, ఉస్మాన్, అశోక్, మాధవి, ఖలీల్, వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్, ఇనాయంత్, సమీర్, గౌస్, మురళి, అవినాష్, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment