వినియోగదారుల ముంగిట సీజీఆర్‌ఎఫ్
● చైర్మన్ ఎన్‌వీ.వేణుగోపాలచారి
హన్మకొండ: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి సీజీఆర్‌ఎఫ్ (విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక)ను వినియోగదారుల ముంగిటికి తీసుకువచ్చినట్లు పరిష్కార వేదిక చైర్మన్ ఎన్‌వీ.వేణుగోపాల చారి తెలిపారు. హనుమకొండ గోపాల్‌పూర్‌లోని విద్యుత్ సబ్ స్టేషన్‌లో లోకల్ కోర్టు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమకొండ నక్కలగుట్టలోని సీజీఆర్‌ఎఫ్ కార్యాలయంలో నేరుగా, తపాలా ద్వారా, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ వెబ్‌సైట్‌లో, ఈ మెయిల్ ద్వారా, 9440811299, 8333923840, 9491307004 నంబర్లలో ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. కార్యక్రమంలో సీజీఆర్‌ఎఫ్ సభ్యులు కె.రమేష్, ఆర్.చరణ్‌దాస్, ఎస్‌ఏఓ అనిల్‌కుమార్, హనుమకొండ డీఈ జి.సాంబరెడ్డి, ఏడీ రాజు, ఏఈలు తారాచంద్, లక్ష్మణ్, నవీన్, రైతులు సంజీవ రావు, గోపాల్ రెడ్డి, జంగారెడ్డి, మోహన్ రావు, ఐలయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment