వరంగల్: ఇందిరమ్మ ఇళ్ల కోసం నిర్వహిస్తున్న సర్వే సమాచారాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ‘యాప్’లో నమోదు చేయాలని బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. నగర పరిధి కాజీపేట సర్కిల్ 56వ డివిజన్ మారుతినగర్‌లో కొనసాగుతున్న సర్వేను ఆమె ఆకస్మికంగా పరిశీలించారు. గడువులోగా సర్వే పూర్తి చేయాలని, డిప్యూటీ కమిషనర్లు, ఆర్‌ఓలు, ఆర్‌ఐలు నిత్యం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రవీందర్, వార్డ్ ఆఫీసర్ జెట్టి రాజు, జూనియర్ అసిస్టెంట్ స్వాతి, ఆర్‌పీ విజయలక్ష్మి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment