పోలీస్ కమిషనరేట్ సమీక్షలో సీపీ కిషోర్ ఝా.. డీసీపీలు రాజమహేంద్రనాయక్, రవీందర్
పోలీసులు సివిల్ పంచాయితీలకు దూరంగా ఉండాలి
కేసుల దర్యాప్తులో వేగం పెంచాలి
నేర సమీక్షలో సీపీ అంబర్ కిషోర్ ఝా
వరంగల్ క్రైం: రౌడీషీటర్లను ఉక్కుపాదంతో అణచివేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా.. అధికారులకు సూచించారు. పోలీస్ కమిషనరేట్‌లో శుక్రవారం పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. పోలీస్‌స్టేషన్లు, డివిజన్లు, జోన్ల వారీగా పెండింగ్ కేసులు, నేరస్తుల అరెస్టు, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ, చార్జిషీట్‌కు సంబంధించిన ప్రస్తుత కేసుల స్థితిగతులపై ఆరా తీశారు.
నమోదైన గ్రేవ్ కేసులు, మహిళలపై నేరాలు, ఆస్తి నేరాలు, పోక్సో కేసులు, మిస్సింగ్, గంజాయి, రోడ్డు ప్రమాదాల కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పెండింగ్, మిస్సింగ్ కేసుల పరి ష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. నిజాయితీగా పనిచేయాలని, సివిల్ పంచా యితీలకు దూరంగా ఉండాలని, తప్పుడు కేసు నమోదు చేయవద్దని, పోలీసులు అప్రమత్తంగా లేకుంటే శాంతిభద్రతలు అదుపు తప్పుతాయని పేర్కొన్నారు.
ముందస్తు సమాచారంతోపాటు రౌడీషీటర్ల స్థితిగతులపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో డీసీపీలు రాజమహేంద్రనాయక్, రవీందర్, ఏఎస్పీ మనాన్ భట్, అదనపు డీసీపీ రవి, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment