సమగ్ర సమాచారం సేకరించండి | - | Sakshi
Sakshi News home page

సమగ్ర సమాచారం సేకరించండి

Published Sat, Dec 28 2024 3:24 PM | Last Updated on Sat, Dec 28 2024 3:24 PM

సమగ్ర సమాచారం సేకరించండి

సమగ్ర సమాచారం సేకరించండి

మేయర్‌ గుండు సుధారాణి

రామన్నపేట: సర్వే ద్వారా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారులనుంచి సమగ్ర సమాచారం సేకరించాలని నగర మేయర్‌ గుండు సుధారాణి సూచించారు. నగరంలోని 29వ డివిజన్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు జరుగుతున్న సర్వే తీరును శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ బల్దియా పరిధిలోని 66 డివిజన్‌లలో సర్వే నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక కోసం సూచించిన ధ్రువ పత్రాలను సమగ్రంగా పరిశీలించి ఆ సమాచారాన్ని యాప్‌లో నమోదు చేస్తారని తెలిపారు. సిబ్బందికి ప్రజలు సహకరించి వాస్తవ సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ ప్రసన్న రాణి, అధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement