విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి
● వరంగల్ కలెక్టర్ సత్య శారద
వరంగల్: జిల్లాలోని 75 సంక్షేమ గురుకులాల పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌హాల్‌లో శనివారం జిల్లా సంక్షేమ శాఖల అధికారులు, ఆర్సీఓలతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. నూతన మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని, విద్యార్థులు స్నానం చేసేందుకు వేడి నీళ్లు అందించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ జిల్లాలో లేని విధంగా వరంగల్ జిల్లాలో వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు, మౌలిక వసతులు కల్పించేందుకు, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నివేదికలు సమర్పించేలా సంస్కరణలు చేసినట్లు చెప్పారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, బీసీ సంక్షేమశాఖ అధికారి పుష్పలత, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి పెద్దిరెడ్డి భాగ్యలక్ష్మి, మైనారిటీ వెల్ఫేర్ అధికారి రమేశ్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి సౌజన్య, జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్, సంబంధిత శాఖల అధికారులు, ఆర్సీఓలు పాల్గొన్నారు.
డబుల్ బెడ్‌రూం ఇళ్లలో వసతులు కల్పించాలి
గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ పైడిపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను దివ్యాంగులకు కేటాయించేందుకు సిద్ధంగా ఉంచాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, అధికారులతో కలిసి శనివారం ఇళ్లను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment