తగ్గిన దిగుబడి
అతి వృష్టితో జిల్లాలో ఆశించిన స్థాయిలో వరి, పత్తి దిగుబడి రాలేదు. ఎకరానికి 20 క్వింటాళ్ల మేరకు సగటున ఉమ్మడి వరంగల్ జిల్లాలో 20లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేయగా సన్న ధాన్యం దిగుబడి తగ్గి 14లక్షలకు దిగుబడి పరిమితం అయ్యింది. అదేవిధంగా పత్తి కూడా ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. ఉమ్మడి వరంగల్‌లో మొత్తం 63లక్షల క్వింటాళ్ల మేరకు పత్తి దిగుబడి ఉంటుందని అంచనాలు వేయగా 3.5లక్షల క్వింటాళ్ల మేరకే దిగుబడి వచ్చిందని రైతులు చెబుతున్నారు. అయితే వరి, పత్తికి మద్దతు ధర ఉన్నా దిగుబడి తగ్గడంతో అన్నదాతలు నిరాశతోనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment