అడ్రినల్ గ్రంథికి అరుదైన చికిత్స
● లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా
కణతి తొలగింపు
● యురాలజిస్టు రాంప్రసాద్‌రెడ్డి
హన్మకొండ చౌరస్తా : అడ్రినల్ గ్రంథిలో ఏర్పడిన కణితిని అత్యంత క్లిష్టమైన లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా తొలగించి రోగి ప్రాణాలను నిలిపిన ఘటన హనుమకొండలోని వేయిస్తంభాల గుడి ఎదురుగా ఉన్న శ్రీ శ్రీనివాస కిడ్నీ సెంటర్‌లో శనివారం జరిగింది. యురాలజిస్టు డాక్టర్ రాంప్రసాద్‌రెడ్డి తెలిపిన వివరాలు.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన నాంపల్లి మానస కడుపునొప్పితో బాధపడుతూ అనేక ఆస్పత్రులలో తిరిగి వైద్యులను సంప్రదించింది. ఫలితం లేకపోవడంతో శ్రీనివాస కిడ్నీ సెంటర్‌ను ఆశ్రయించింది. వైద్య పరీక్షలు నిర్వహించగా మానసకు అడ్రినల్ గ్రంథిలో 14సెంటీ మీటర్ల కణతి, స్ల్పీన్, ప్యాంక్రియాస్, ఎడమ కిడ్నీకి అతుక్కుని ఉన్నట్లు గుర్తించారు. మూడు గంటలు శ్రమించి లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా కణతిని తొలగించినట్లు, మిగతా అవయవాలకు ఎలాంటి నష్టం జరగకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించామని పేర్కొన్నారు. రోగి కోలుకోగా డిశ్చార్జి సైతం చేసినట్లు డాక్టర్ రాంప్రసాద్‌రెడ్డి చెప్పారు. హైదరాబాద్ తర్వాత హనుమకొండలో ఇలాంటి ఆపరేషన్ చేయడం ఇదే తొలిసారి అని వివరించారు. ఆపరేషన్‌లో డాక్టర్ రాంప్రసాద్‌రెడ్డితో పాటు అభినయ్, ప్రభురామ్, అనస్తీషియా వైద్యుడు సామ్రాట్ పాల్గొన్నారు.
ఖోఖో టోర్నమెంట్‌కు కేయూ జట్టు
కేయూ క్యాంపస్: కోల్‌కతా యూనివర్సిటీలో ఈనెల 28న ప్రారంభమై 31 వరకు కొనసాగనున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ ఖోఖో టోర్నమెంట్‌కు కాకతీయ యూనివర్సిటీ ఉమెన్ ఖోఖో జట్టు పాల్గొననున్నట్లు కేయూ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ ప్రొఫెసర్ వై.వెంకయ్య శనివారం తెలిపారు. ఈజట్టులో ఎం.నవ్య, ఎన్.నర్మద, పి.శిరీష, ఎం.సంధ్య, సీహెచ్ చైతన్య, పి.శ్వేత, బి.నిఖిత, సీహెచ్.హేమ, వి.స్నేహ, భీమారం, కె.దివ్య, ఎ.అనూష, ఎం.నిఖితాంజలి, ఎస్.సోనీ, కావ్య, టి.వర్షిత ఉన్నారు. ఈజట్టుకు కాకతీయ యూనివర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ ఎస్.కిరణ్ కుమార్‌గౌడ్ కోచ్‌కమ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నట్లు వెంకయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment