ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీలో కొంతమంది రైతులకే అర్హత ఉండడం, మరికొందరికి మాఫీ కాకపోవడంతో వచ్చిన వారిలో సంతోషం, రాని వారిలో ఎదురుచూపు మిగిలింది. రూ.2లక్షల లోపు రైతు రుణమాఫీలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2,77,048 మంది రైతులకు రూ.2,689 కోట్ల మేర రుణాలు మాఫీ అయ్యాయి. అయితే రూ.2లక్షలకు పైగా రుణాలు ఉన్న 46వేలకు పైగా రైతులు రుణమాఫీ ఎప్పుడు అవుతుందో అని ఎదురు చూస్తున్నారు.
పెట్టుబడికి తప్పని ఇబ్బంది
గత ప్రభుత్వం రైతులకు ఏడాదికి రెండు సార్లు రూ.18,40కోట్లు రైతు బంధు పథకం ఇచ్చేది. కానీ 2024లో రైతులకు రైతుబంధు (రైతు భరోసా) రాలేదు. దీంతో పంటసాగుకు పెట్టుబడి కోసం మళ్లీ వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లాల్సి వచ్చిందని అన్నదాతలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment