తర్వాత ఎవరు | - | Sakshi
Sakshi News home page

తర్వాత ఎవరు

Published Mon, Jan 20 2025 1:16 AM | Last Updated on Mon, Jan 20 2025 1:16 AM

తర్వాత ఎవరు

తర్వాత ఎవరు

కాజీపేట అర్బన్‌: వైరా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సబ్‌ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న రామచంద్రయ్యపై శుక్రవారం సస్పెన్షన్‌ వేటు పడింది. దీంతో రిజిస్ట్రేషన్స్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖలో పని చేస్తున్న సబ్‌ రిజిస్ట్రార్లకు తామూ సస్పెండ్‌ అవుతామనే భయం పట్టుకుంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సొంత జిల్లాలో అక్రమ రిజిస్ట్రేషన్లు, అవినీతికి పాల్పడిన ఘటనతో సస్పెన్షన్‌ వేటు పడగా.. ఇన్‌చార్జ్‌ మంత్రిగా వ్యవహరిస్తున్న వరంగల్‌లో అక్రమాలకు పాల్పడుతున్న సబ్‌ రిజిస్ట్రార్లపై వేటు పడక తప్పదంటూ జంకుతున్నారు. నాన్‌ లేఔట్‌లతో పాటు నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్న ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని సబ్‌ రిజిస్ట్రార్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

మారని తీరు..

గతేడాది జూలై 31న రిజిస్ట్రేషన్స్‌, స్టాంప్స్‌ శాఖలో అవినీతి, అక్రమాలను నిర్మూలించేందుకు జీరో ట్రాన్స్‌ఫర్స్‌ పేరిట అటెండర్‌ స్థాయి నుంచి జిల్లా రిజిస్ట్రార్‌ స్థాయి వరకు బదిలీలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. కాగా.. ఆగస్టులో ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్లు, సబ్‌ రిజిస్ట్రార్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వారు ఉమ్మడి వరంగల్‌లో విధుల్లో చేరారు. కాగా.. వరంగల్‌ డీఐజీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న తరుణంలోనే రామచంద్రయ్య ఇన్‌చార్జ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా వరంగల్‌ ఆర్వోలో అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడడంతో సస్పెండ్‌కు గురయ్యారు.. కాగా.. బదిలీ అయ్యి వైరాలో సబ్‌ రిజిస్ట్రార్‌గా చేరి.. తీరు మార్చుకోకపోవడంతో శుక్రవారం మరోసారి సస్పెండ్‌ అయ్యా రు. బదిలీల్లో భాగంగా వరంగల్‌ ఆర్వోలో విధులు నిర్వహిస్తున్న జాయింట్‌–2 సబ్‌ రిజిస్ట్రార్‌ తొలుత స్టేషన్‌ఘన్‌పూర్‌కు బదిలీ కాగా.. జోన్‌లో భాగంగా మళ్లీ జనగామకు బదిలీ అయ్యారు. విజిలెన్స్‌ అధికారులు సదరు సబ్‌ రిజిస్ట్రార్‌పై ఆరా తీస్తున్నారనే సమాచారంతో మరో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి బదిలీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచా రం. ఈసారి ఏకంగా ఖమ్మం, వరంగల్‌ కాకుండా మరో జిల్లాకు బదిలీ అయ్యేందుకు పక్కా ప్లాన్‌ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

నోటీస్‌ అందజేశాం..

వరంగల్‌ ఆర్వో రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న జాయింట్‌–2 సబ్‌ రిజిస్ట్రార్‌పై ఇటీవల అవినీతి, అక్రమ రిజిస్ట్రేషన్లపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాం. నివేదిక ఆధారంగా డీఐజీ సదరు అధికారికి నోటీస్‌ అందజేశారు.

– ఫణీంధర్‌, జిల్లా రిజిస్ట్రార్‌, వరంగల్‌

రిజిస్ట్రేషన్‌ శాఖలో ‘సస్పెన్షన్‌’ దడ

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో చర్చ

బదిలీ అయినా తీరు మార్చుకోని కొందరు

ఉమ్మడి జిల్లాలో సస్పెన్షన్స్‌ ఇలా..

వరంగల్‌ ఆర్వో రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో జాయింట్‌–2 సబ్‌ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న సురేంద్రబాబు 2021లో అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్లు విచారణలో తేలడంతో సస్పెన్షన్‌కు గురయ్యారు. అదే ఏడాది జాయింట్‌–1 స్థాయి సబ్‌ రిజిస్ట్రార్‌గా సంపత్‌కుమార్‌, ఇన్‌చార్జ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా రామచంద్రయ్య రెండు నెలల వ్యవధిలో ఇన్‌చార్జ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా సీని యర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్‌ అక్రమ రిజిస్ట్రేషన్ల నేపథ్యంలో సస్పెన్షన్‌కు గురయ్యారు. కాగా.. 2024లో వరంగల్‌ ఫోర్ట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఇన్‌చార్జ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహించిన రాజేశ్‌ అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడడంతో ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement