సిటీ ఆర్ముడ్ రిజర్వ్ విభాగం
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి పోలీసులకు మూడు రోజులుగా నిర్వహిస్తున్న పోలీస్ క్రీడలు ఆదివారం ముగిశాయి. వార్షిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2025లో సిటీ ఆర్ముడ్ రిజర్వ్ విభాగం 125 పతకాలు గెలుచుకుని ఓవరాల్ చాంపియన్ షిప్ కైవసం చేసుకుంది. ఈస్ట్‌జోన్ 51, సెంట్రల్ జోన్ 50, వెస్ట్‌జోన్ 19, ఇతర విభాగాల జట్లు 21 పతకాలను గెలుచుకున్నాయి. ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ జట్టు, డీసీపీ అధికారుల జట్లకు మధ్య టగ్ ఆఫ్ వార్ పోటీ నిర్వహించగా సీపీ జట్టు విజయం సాధించింది. అనంతరం విజేతలకు సీపీ అంబర్ కిశోర్‌ఝూ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ నిరంతరం విధినిర్వహణలో ఉండే పోలీసులకు ఈ క్రీడలు ఉల్లాసాన్ని కలిగించాయన్నారు. క్రీడలతో దేహదారుఢ్యంతోపాటు, అనారోగ్య సమస్యలు దరిచేరవని చెప్పారు. కమిషనరేట్ పోలీస్ క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబర్చి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు షేక్ సలీమా, రాజమహేంద్రనాయక్, రవీందర్, అదనపు డీసీపీలు రవి, సురేశ్‌కుమార్, ఏఎస్పీ చేతన్‌తో పాటు ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన పోలీస్ క్రీడలు
Comments
Please login to add a commentAdd a comment