ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయాలి
● టీఎన్‌హెచ్‌ఏ రాష్ట్ర ప్రతినిధులు
ఎంజీఎం: రాష్ట్రవ్యాప్తంగా పేరుకుపోయిన ఆరోగ్యశ్రీ బకాయిలు వెంటనే చెల్లించాలని తెలంగాణ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్(టీఎన్‌హెచ్‌ఏ) రాష్ట్ర ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ ఐఎంఏ హాల్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లెయిమ్స్ రానందున అన్ని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు ఈనెల 10 నుంచి ఆరోగ్యశ్రీ రోగులకు చికిత్సను నిలిపేసినట్లు తెలిపారు. సేవల్ని నిలిపేయడానికి కారణాలు తెలుపుతూ.. ఆస్పత్రులు వారి కన్సల్టేషన్ మొత్తాలను, జీతాలను చెల్లించలేనందున కన్సల్టెంట్లు పని చేయడానికి ఇష్టపడరని, ఆర్నెళ్లుగా ఆస్పత్రులు తమ మొత్తాన్ని చెల్లించలేకపోయినందున సరఫరాదారులు తమ సరఫరాలను నిలిపివేశారని, ఈనేపథ్యంలో తమ ప్రతిపాదనలను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రికి, ఆరోగ్యశ్రీ సీఈఓ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు కూడా అందించామని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ బాధ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment