హన్మకొండ అర్బన్:
ప్రజాసమస్యల తక్షణ పరిష్కారమే ‘ప్రజావాణి’ ధ్యేయం. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏకంగా రాష్ట్ర రాజధానిలోనే ప్రజాదర్బార్ పేరుతో ఏర్పాటు చేసింది. సాధ్యమైన సమస్యలకు తక్షణ పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జిల్లా కేంద్రాల్లో ప్రతీ సోమవారం నిర్వహించే ‘గ్రీవెన్స్’కు అధికారులు జవాబుదారీగా ఉండాలని స్పష్టం చేసింది. అయితే కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా సర్కారు లక్ష్యం నీరుగారిపోతోంది. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలి.. ఏ చర్యలు తీసుకున్నారో దరఖాస్తుదారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో అమలు కావడంలేదు. ముఖ్యంగా కలెక్టర్ చెప్పినప్పుడు ‘ఓకే.. మేడం’ అంటున్నారు.. తరువాత పట్టించుకోవడంలేదు. ఇందుకు జిల్లా పరిధి 14 మండలాలు, రెండు ఆర్డీఓ కార్యాలయాలు, కలెక్టరేట్‌లోని వివిధ సెక్షన్లు కలిపి పెండింగ్‌లో ఉన్న 1,200 దరఖాస్తులే నిదర్శనం.
రెవెన్యూ నిర్లక్ష్యం..
కలెక్టరేట్ ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే దరఖాస్తుల్లో రెవెన్యూ శాఖకు ప్రధానంగా భూ సంబంధమైనవే అధికంగా ఉంటున్నాయి. వీటిలో ధరణి ఫిర్యాదులు, వినతులను అధికారులు చిన్నచిన్న సాంకేతిక కారణాలు సాకుగా చూపి ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెడుతున్నారు. ఒక వేళ ధరణి ద్వారా దరఖాస్తు చేసినా ఆ పని చట్టపరంగా చేయలేనప్పుడు.. సాంకేతిక ఇబ్బందులు ఉన్నప్పుడు.. దాన్ని ఆన్‌లైన్‌లో తిరస్కరించి అదే సమాచారం అర్జీదారులకు చెపితే సరిపోతుంది. కానీ అధికారులు ఆవిషయం చెప్పరు. దరఖాస్తు ఎక్కడ ఉన్నది.. ఏం జరగుతున్నది చెప్పకపోవడంతో ఆందోళన అధికమై కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇక హనుమకొండ ఆర్డీఓ కార్యాలయంలో ఏడాది కాలంగా పెండింగ్ పడిన ధరణి ఫైళ్లు కనిపించకుండా పోయినవి లెక్కకు మించి ఉన్నాయి.
అధిక సంఖ్యలో అర్జీలు పెండింగ్ ఉన్న
శాఖలు, కార్యాలయాల వివరాలు
శాఖ దరఖాస్తులు పరిష్కారం పెండింగ్
జీడబ్ల్యూఎంసీ 4358 3592 766
సీపీ, వరంగల్ 528 224 304
కలెక్టరేట్ డీ సెక్షన్ 677 146 531
కలెక్టరేట్ ఈ సెక్షన్ 315 83 232
ఆర్‌ఈహెచ్, వరంగల్ 914 779 135
తహసీల్దార్ హసన్‌పర్తి 1204 1098 106
తహసీల్దార్, ఆత్మకూరు 169 65 104
తహసీల్దార్, కాజీపేట 948 737 211
తహసీల్దార్, పరకాల 148 51 97
డీఆర్‌ఓ(సెక్షన్లు) 129 63 66
స్టాంప్స్ అండ్ రిజిస్టేషన్స్ 49 05 44
‘కుడా’, వీసీ 150 09 141
Comments
Please login to add a commentAdd a comment