సామాన్యులే ప్రత్యేక అతిథులై..
సాక్షి, వరంగల్: న్యూఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో జిల్లా నుంచి నలుగురు ప్రత్యేక అతిథులుగా హాజరుకానున్నారు. ఈ నెల 26వ తేదీన న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలో పీఎం యశస్వి పథకం, గ్రామీణాభివృద్ధి, పీఎం మత్స్య సంపద యోజన బెనిఫిషియర్స్, మన్ కీ బాత్‌లో పాల్గొన్న వారితో పాటు విభిన్న రంగాల్లో రాణించిన వారికి కేంద్రం అవకాశం కల్పించింది. పీఎం యశస్వి పథకం గురించి కృషి చేసిన నర్సంపేటలోని ప్రభుత్వ బీసీ కాలేజీ బాలికల హాస్టల్ నుంచి భీమగాని శాలిని, గ్రామీణాభివృద్ధి రంగంలో సేవలందించిన వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన ఎడ్ల అరుణ, పీఎం మత్స్య సంపద యోజన బెనిఫిసియర్స్ కేటగిరి కింద కరీమాబాద్‌లోని ఉర్సు గుట్టకు చెందిన బైరి పట్టాభి, మన్ కీ బాత్‌లో పాల్గొన్న గీసుకొండ మండలం గంగాదేవిపల్లిలోని గోనె మల్లయ్య ప్రత్యేక అతిథులుగా జిల్లా నుంచి హాజరుకానున్నారు.
న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో నలుగురు పాల్గొనే అవకాశం
చేపల వ్యాపారంలో
రాణిస్తున్న బైరి పట్టాభి,
స్వయం సహాయక సంఘాల
బలోపేతానికి కృషి చేస్తున్న అరుణ
కేంద్రం అమలు చేస్తున్న పీఎం యశస్వి
పథకానికి ఎంపికై న శాలిని
మన్ కీ బాత్‌లో
పాల్గొన్న మల్లారెడ్డికి చాన్స్
Comments
Please login to add a commentAdd a comment