పరస్పర బదిలీలకు అండర్ టేకింగ్
● 92 మందికి 86మంది టీచర్లు..
ఇద్దరు నాట్‌విల్లింగ్
విద్యారణ్యపురి : పరస్పర బదిలీలకు దరఖాస్తులు చేసుకున్న టీచర్ల అండర్ టేకింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. హనుమకొండ జిల్లాకు వివిధ జిల్లాల నుంచి ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్ తదితర కేటగిరీల ఉపాధ్యాయులు 92 మంది దరఖాస్తు చేసుకున్నారు. హనుమకొండ డీఈఓ కార్యాలయంలో సోమవారం ఎక్కువ మంది ఉపాధ్యాయులు అండర్ టేకింగ్ ఇచ్చారు. అలాగే సర్వీస్‌బుక్స్‌ను పరిశీలన చేయించుకున్నారు. ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చే ఉపాధ్యాయులతోపాటు ఇక్కడినుంచి ఇతర జిల్లాలకు వెళ్లేవారు కూడా అండర్ టేకింగ్ ఇస్తున్నారు. 92మంది ఉపాధ్యాయుల్లో సోమవారం సాయంత్రం వరకు 86మంది పరస్పర బదిలీలకు అండర్ టేకింగ్ ఇవ్వగా మరో ఇద్దరు నాట్ విల్లింగ్ ఇచ్చారు.ఆ ఇద్దరు పరస్పర బదిలీలకు దరఖాస్తు చేసుకొని ఇప్పుడు వెనక్కి తగ్గారు. నేటివరకు అండర్‌టేకింగ్ ప్రక్రియకు అవకాశం ఉండగా, 22న వారి వివరాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌కు డీఈఓ పంపనున్నారు.
స్పౌజ్ కేటగిరీ బదిలీ..
జిల్లాకు ఐదుగురు కేటాయింపు
ఎట్టకేలకు స్పౌజ్ కేటగిరీ టీచర్ల బదిలీలకు అవకాశం లభించింది. హనుమకొండ జిల్లాకు స్పౌజ్ కేటగిరీలో ఐదుగురి బదిలీలకు అవకాశం కల్పిస్తూ సోమవారం సాయంత్రం డీఈఓకు జాబితా వచ్చింది. అందులో పాకరాజు (బయోసైన్స్), బానోత్ కృష్ణ (సోషల్‌స్టడీస్), ఎస్జీటీలు ముగ్గురు అరుణ్ జ్యోతి, నాగారం సరళ, రాంభూపాల్ స్పౌజ్ కేటగిరీలో హనుమకొండకు కేటాయించారు. వీరికి జిల్లాలోని క్లియర్ వెకన్సీల్లో పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వబోతున్నారు. వీరికి సంబంధించిన పలు వివరాలను పరిశీలించాకే రెండు మూడురోజుల్లో డీఈఓ వాసంతి వీరికి పాఠశాలలను కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment