![వయోవృద్ధులకు ప్రాధాన్యం ఇవ్వాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/08hmkd55-330086_mr-1739044334-0.jpg.webp?itok=9UhBWpvg)
వయోవృద్ధులకు ప్రాధాన్యం ఇవ్వాలి
హన్మకొండ: వయోవృద్ధులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని హనుమకొండ డీఆర్‌ఓ అన్నారు. శనివా రం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వయోవృద్ధుల కమిటీ సమావేశంలో ఆయన మా ట్లాడుతూ.. వయోవృద్ధులకు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ప్రత్యేక సేవలందించాలని చెప్పా రు. ప్రతీ గురువారం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వయోవృద్ధుల కోసం ప్రత్యేక ఓపీ సేవలు నిర్వహించాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి క్షమా దేశ్‌పాండే మాట్లాడుతూ వయోవృద్ధుల పోషణ, సంరక్షణ చట్టం–2007పై ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నామ న్నారు. జిల్లా సంక్షేమ అధికారి జయంతి, జిల్లా ఆస్పత్రుల నిర్వహణ అధికారి డాక్టర్ గౌతమ్‌చౌహన్, ఎన్‌సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ పాల్గొన్నారు.
జిల్లా రెవెన్యూ అధికారి గణేష్
Comments
Please login to add a commentAdd a comment