అధికారులకు సమస్యలను వివరిస్తున్న అశ్విని లే అవుట్ కాలనీవాసులు
ఫిలింనగర్: కాలనీల చెంతకే అధికారులు కార్యక్రమంలో భాగంగా జూబ్లీహిల్స్ డివిజన్ జర్నలిస్టు కాలనీ సమీపంలోని అశ్విని లే అవుట్ కాలనీలో వివిధ విభాగాల అధికారులు కాలనీవాసులతో జూబ్లీహిల్స్ జీహెచ్‌ఎంసీ డీఈ, కార్యక్రమ నోడల్ అధికారి హరేరామ్ అధ్యక్షతన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను కాలనీ అధ్యక్షులు కార్తీక్, కార్యదర్శి విఠల్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. సీవరేజి సమస్య తీవ్రంగా ఉందని స్టానికులు అధికారుల దృష్టికి తీసుకురాగా జలమండలి ఫిలింనగర్ సెక్షన్ మేనేజర్ పవన్ ఈసమస్యను పరిష్కరించే దిశలో తగు ప్రణాళికలు రూపొందిస్తామని హామీ ఇచ్చారు. వరద నీరు రోడ్లపై నిలిచిపోతుందని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పోలీస్, జీహెచ్‌ఎంసీ అర్బన్ ఫారెసీ్ట్ర, విద్యుత్, శానిటేషన్, ఇంజినీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment