వాషింగ్టన్: అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేయాలని భావిస్తున్న డ్రోన్ల ఒప్పందం ఒక కొలిక్కి వచ్చిందని తెలుస్తోంది. 300 కోట్ల డాలర్ల వ్యయంతో 30 ప్రిడేటర్ సాయుధ డ్రోన్లను కొనుగోలు ఒప్పందం దాదాపు అయిపోవచ్చిందని వైట్‌హౌస్‌లో వివిధ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2017లో అమెరికా పర్యటన సమయంలో ఈ ఒప్పందంపై ప్రకటన చేశారు.
అప్పట్నుంచి ఇరు దేశాల మధ్య చర్చోపచర్చలు జరుగుతున్నాయి. తొలుత 10 డ్రోన్లను కొనుగోలు చేయాలని భావించిన భారత్ ఆ తర్వాత వాటి సంఖ్యను 30కి పెంచింది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో పదేసి డ్రోన్లను సరఫరా చేయడానికి అమెరికా అంగీకరించింది. నాటోయేతర దేశాల్లో భారత్‌కే తొలిసారిగా అమెరికా ఈ డ్రోన్లను విక్రయించనుంది.
Comments
Please login to add a commentAdd a comment