![అవార్డు అందుకుంటున్న ఉప్పల శ్రీనివాస్ - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/24/23srl176-180048_mr_1.jpg.webp?itok=0Q9BaMBk)
అవార్డు అందుకుంటున్న ఉప్పల శ్రీనివాస్
సిరిసిల్ల కల్చరల్: పట్టణానికి చెందిన ప్రముఖ యోగాచార్యుడు ఉప్పల శ్రీనివాస్‌కు తమిళనాడుకు చెందిన సంస్థ ప్రత్యేక అవార్డు అందజేసింది. దశాబ్ద కాలంలో సుమారు 6 వేల మందికి యోగా సాధనలో శిక్షణనిస్తూ సేవలందిస్తున్నందున శ్రీయోగి యోగశ్రీ బిరుదును బహూకరిస్తున్నట్లు ఆ సంస్థ తరఫున అవార్డు అందించిన జిల్లా న్యాయమూరి ఎన్ ప్రేమలత తెలిపారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు. వేసవి సెలవులను సద్వినియోగం చేస్తూ విద్యార్థుల్లో యోగాపై ఆసక్తిని పెంచడంతో పాటు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో ఆయా విద్యార్థులు రాణించేలా కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ను ప్రేమలత అభినందించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోడి లక్ష్మణ్, ప్రతినిధులు ఎస్.అనిల్‌కుమార్, ఏజీపీ రవీందర్, జక్కని వెంకట్రాజం, గంగాధర్, అల్లాడి శ్రీనివాస్, యాద రమేశ్, బిల్ల శ్రీకాంత్, శ్రీనివాస్, శ్రీదేవి, చంద్రకళ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment