అమ్మా..నేనెలా చదువుకోవాలి!
విద్యాబుద్ధుల నేర్చుకుందామని స్కూల్‌కు వెళ్తే.. పాఠాలు చెప్పే టీచర్లే ఇంత కీచకులుగా మారితే నేనెవరికీ చెప్పుకోవాలి..? విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే వంకరబుద్ధి చూపుతుంటే బడికి ఎలా వెళ్లేది..? సమాజంలో ఎలా బతకాలో దిశానిర్దేశం చేయాల్సిన మార్గదర్శి మతిపోయి ప్రవర్తిస్తుంటే నేనెలా నిలబడేది..? సమాజంలోని మంచి, చెడు గురించి బోధించాల్సిన పెద్దమనిషి చెడుగా నా శరీరాన్ని తచ్చాడుతుంటే నేనెలా తట్టుకునేది..? ఆకాశంలో.. అవనిలో సగమంటూ గొప్పలు చెప్పుకుంటున్న సమాజంలో పాఠశాలలో చదువుకునే పరిస్థితులే లేకుంటే ఆ అవకాశాలను నేనెలా అందుకునేది..? అంటూ నేటి తరం బాలికలు సమాజాన్ని ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటీవల కొందరు ఉపాధ్యాయులు వెకిలిచేష్టలకు పాల్పడడంతో వరుసగా పోక్సో కేసులు నమోదవుతున్నాయి. ఇటీవ ల వెలుగుచూసిన కొన్ని సంఘటనలు సమాజాన్ని తలదించుకునేలా చేశాయి.
8లోu
Comments
Please login to add a commentAdd a comment