సమగ్ర కుటుంబ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
● కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలి ● ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
జగిత్యాల: జిల్లాల్లో సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమా ర్క అన్నారు. కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రజల సందేహాలను నివృత్తి చేయాలని, వాటిని ఎన్యుమరేటర్లు కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ప్రజలతో మమేకమైతే సందేహాలు తెలుస్తాయన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సర్వేలో భాగస్వామ్యం అయ్యేలా చూడాలన్నారు. సర్వేతో అర్హులందరికీ మేలు జరుగుతుందన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. ప్రజ లకు అనుమానాలు, సందేహాలు రాకుండా కచ్చితమైన సమాచారం సేకరించాలని ఎన్యుమరేటర్లకు సూచించామన్నారు. ఎప్పటికప్పుడు సూపర్‌వైజ ర్లు, మండల ప్రత్యేకాధికారులు పర్యవేక్షిస్తున్నారని వివరించారు. ప్రజల నుంచి సేకరించిన సమాచా రం పూర్తిగా గోప్యంగా ఉంచుతామన్నారు. ఉపాధ్యాయులు, అంగన్‌వాడీలు, డీఆర్డీఏ సిబ్బంది మా త్రమే సర్వేకు వస్తారని, ఇతరులు వస్తే సమాచారం ఇవ్వొద్దని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గౌతంరెడ్డి, ఆర్డీవో మధుసూదన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment