గ్రూప్–3 పరీక్షలు సజావుగా నిర్వహించాలి
జగిత్యాల: గ్రూప్–3 పరీక్షలు సజావుగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో రూట్ ఆఫీసర్స్, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ల శిక్షణలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గ్రూప్–3 పరీక్షలకు నిర్దేశించిన విధులు పకడ్బందీగా నిర్వర్తించాలన్నారు. ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గౌతంరెడ్డి, జేఎన్‌టీయూ ప్రిన్సిపల్ రావు, ఆర్డీవో మధుసూదన్ పాల్గొన్నారు.
అలరించిన జీవన్‌రెడ్డి వేషధారణ
జగిత్యాల: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన చిన్నారి వేదాన్ష్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వేషధారణతో ఆకట్టుకున్నాడు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వద్దకు వెళ్లగా.. ఆయన చిన్నారిని అభినందించారు. పిల్లాడితో కాసేపు నవ్వుకుంటూ గడిపారు ఎమ్మెల్సీ.
తక్కళ్లపల్లి పీఏసీఎస్ చైర్మన్‌గా చంద్రశేఖర్
మల్యాల: మండలంలోని తక్కళ్లపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్‌గా తొట్ల చంద్రశేఖర్‌ను డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి సీహెచ్.మల్లేశం తెలిపారు. చైర్మన్‌గా ఉన్న ముదుగంటి మధుకర్ రెడ్డి ఏడాదిక్రితం మృతిచెందిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో ఎన్నిక అనివార్యమైంది. గురువారం చైర్మన్ ఎన్నికకు మల్లేశం సమావేశం ఏర్పాటు చేయగా.. తొట్ల చంద్రశేఖర్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. నిబంధనల ప్రకారం ఆయనను చైర్మన్‌గా ప్రకటించారు. డైరెక్టర్లు ముదుగంటి హరికృష్ణ రెడ్డి, సుల్తాన్ లచ్చన్న, రంగు తిరుపతి గౌడ్, తూకుంట్ల మంజుల, బైరీ మనోహర్ రెడ్డి, చీకట్ల అశోక్, ఊకంట అన్నారెడ్డి, ఎదులాపురం భూమతి, బల్మూరి భాస్కర్‌రావు, కరకాల నర్సయ్య హాజరయ్యారు. కాంగ్రెస్ నాయకులు బత్తిని శ్రీనివాస్ గౌడ్, మరాటి లక్ష్మీనారాయణ, మ్యాక లక్ష్మణ్, శనిగరపు తిరుపతి, గుర్రపు వెంకన్న తదితరులు చంద్రశేఖర్‌ను అభినందించారు.
బాధ్యతలు స్వీకరించిన గోవర్ధన్
మెట్‌పల్లి: మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా కూన గోవర్దన్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఆయనకు మార్కెట్ కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. పీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజీత్‌రావు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నూతన పాలకవర్గంలో గోరుమంతల ప్రవీణ్‌కుమార్, అనిరెడ్డి రాజశేఖర్, పిడుగు అమృత్‌లాల్, గుగ్లావత్ ప్రభాకర్, పుప్పాల గంగాధర్, మానాల లింగారెడ్డి, అందె భవితరాణి, సంగు గంగాధర్, పల్లి శేఖర్‌గౌడ్, నూతుల రవీందర్, పుల్లూరి నవీన్, కాటిపెల్లి అనంతరెడ్డిని డైరెక్టర్లుగా ప్రభుత్వం నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment