సహకార సంఘాల అభివృద్ధికి ప్రభుత్వ సహకారం
జగిత్యాలఅగ్రికల్చర్: రాష్ట్రంలోని సహకార సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం సహకారం అందిస్తోందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో 71వ అఖిల భారత సహకార వారోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. కలెక్టర్ సత్యప్రసాద్, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అడ్లూరి మాట్లాడుతూ.. జిల్లాలోని సహకార సంఘాలు రైతులకు రుణాలు ఇవ్వడం, ఎరువులు అందించడమే కాక.. పలు వ్యాపారాలు నిర్వహించి జాతీయస్థాయికి ఎదగాలని సూచించారు. విత్తనం అమ్మేస్థాయి నుంచి పంట కొనుగోలు వరకు సహకార సంఘాలు ముందువరుసలో ఉన్నాయన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. సహకార సంఘాలు ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా.. మిల్లింగ్ చేసేందుకు అవసరమైన రైస్‌మిల్లులు ఏర్పాటు చేయాలని సూచించారు. సహకార సంఘాలు ప్రభుత్వాలపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించాలన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మాట్లాడుతూ.. రైతులు ఎప్పుడు ఒకే పంట వేయకుండా.. పంట మార్పిడి విషయంలో సహకార సంఘాలు రైతులకు తోడ్పాటు నందించాలన్నారు. డెయిరీ, చక్కె ర పరిశ్రమల రంగంలో సహకార సంఘాలు మంచి పురోగతి సాధిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి మనోజ్‌కుమార్, డీసీ ఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, నాబార్డు డీడీఎం దిలీప్ చంద్ర, జిల్లా వ్యవసాయాధికారి రాంచందర్, మున్సిపల్ చైర్‌పర్సన్ జ్యోతి పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment