జిల్లా అభివృద్ధికి కృషి చేద్దాం
జగిత్యాల:జిల్లా అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా పనిచేద్దామని జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) చైర్మన్, ఎంపీ అర్వింద్ అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన దిశ సమావేశంలో మాట్లాడారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను పకడ్బందీగా వినియోగించాలని సూచించారు. పాఠశాలల్లో సదుపాయాలు, స్వచ్ఛభారత్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జిల్లాను స్మార్ట్‌సిటీలో భాగం చేస్తామని హామీ ఇచ్చారు. సమగ్ర శిక్ష అభియాన్, నేషనల్ హైవేస్, గ్రామీణ సడక్ యోజన, నేషనల్ హెల్త్ మిషన్, ఆవాస్ యోజన, సెంట్రల్ ఫండ్ ద్వారా వివిధ రోడ్లు, ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ ప్రోగ్రాం, మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, మల్టీసెక్యులర్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలను ప్రజలకు చేర్చాలన్నారు. ఎన్‌హెచ్–63, పంచాయతీరాజ్, ఈజీఎస్ పనులను త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. వైద్యంపై దృష్టి సారించాలని వైద్యాధికారులకు సూచించారు. ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం కొనుగోలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని విప్ లక్ష్మణ్‌కుమార్ కోరారు. వ్యవసాయాధారిత జిల్లా కావడంతో రైతులు వరిసాగు చేస్తున్నారని తెలిపారు. దీనికి అర్వింద్ మాట్లాడు తూ ఎఫ్‌సీఐ నిబంధనల మేరకు కొనుగోలు చేస్తుందన్నారు. జగిత్యాల స్మార్ట్‌సిటీ చేయాలని, అమృత్ పథకంలో చేర్చాలని కోరారు. వచ్చే జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకుంటామని ఎంపీ తెలిపారు.
తాగునీటి పనులు ప్రారంభం
అనంతరం ఎంపీ అమృత్ 2.0లో భాగంగా మంజూరైన రూ.38.60 లక్షలతో తాగునీటి సరఫరాకు కొత్తబస్టాండ్‌లో శంకుస్థాపన చేశారు. జిల్లాకేంద్రంలో రూ.30కోట్లతో మిషన్ భగీరథ ద్వారా పట్టణంలో పైప్‌లైన్ నిర్మించామని ఎమ్మెల్యే సంజయ్ తెలిపారు. జిల్లా కేంద్రంలో 14 జోన్లు ఏర్పాటు చేశామని, రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా 4,520 డబుల్‌బెడ్‌రూం ఇళ్లు నిర్మించామని తెలిపారు. రాయికల్ మండలం జగన్నాథపూర్ ట్రైబల్ గ్రామానికి రూ.16 కోట్లతో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం, ఎన్‌హెచ్–63లో అంతర్గాం వద్ద అండర్ పాస్, కొత్తబస్టాండ్, తిప్పన్నపేట, ధరూర్, బ్లాక్‌స్పాట్ల ఏర్పాటుకు, ఎన్‌హెచ్–61 ఇటిక్యాల, సింగరావుపేట వద్ద బ్రిడ్జి, ఎస్టీపీ సివరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు నిధులు మంజూరు చేయాలని ఎంపీని కోరారు. కలెక్టర్ సత్యప్రసాద్, అడిషనల్ కలెక్టర్లు లత, గౌతంరెడ్డి, డీపీవో రఘువరణ్, జగిత్యాల, రాయికల్, ధర్మపురి మున్సిపల్ చైర్మన్లు అడువాల జ్యోతి, హన్మాండ్లు, సత్తమ్మ, జగిత్యాల కమిషనర్ చిరంజీవి, ఈఈ సంపత్‌రావు, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, వరుణ్ పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారం దిశగా అధికారులు పనిచేయాలి
జగిత్యాలను స్మార్ట్ సిటీ చేస్తాం
‘దిశ’ చైర్మన్, ఎంపీ అర్వింద్
Comments
Please login to add a commentAdd a comment