కోటిలింగాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా
వెల్గటూర్(ధర్మపురి): మండలంలోని కోటిలింగాల క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం కార్తీకపౌర్ణమి సందర్భంగా కోటేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో కోటిలింగాలను పర్యాటక కేంద్రంగా చేస్తానని చెప్పిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పదేళ్లలో పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. శాతవాహనుల తొలి రాజధాని అయిన కోటింగాలకు ఎంతో ప్రాశస్త్యం ఉందని, అలాంటి క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు సమస్యలు సృష్టించి ప్రభ్వుత్వాన్ని అస్థిరపరచాలని కుట్రలు చేయడం సిగ్గేచేటన్నారు. అనంతరం గోదావరినదిలో బోటింగ్ చేశారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డి, మేరుగు మురళి, సందీప్‌రెడ్డి, శ్రీకాంత్‌రావు, పూదరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
● విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment