ధర్మపురి/సారంగాపూర్/రాయికల్/మల్లాపూర్/పెగడపల్లి: కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం జిల్లాలోని శివాలయాలు కిటకిటలాడాయి. భక్తులు ఆలయాల్లో దీపాలు వెలిగించి పునీతులయ్యారు. ధర్మపురిలోని బ్రహ్మపుష్కరిణి దీపకాంతుల్లో వెలుగొందింది. కోనేరుకు నలువైపులా పంచ సహస్ర దీపాలు వెలిగించారు. దీపకాంతులను చూసి భక్తులు పరవశించారు. విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ సత్తమ్మ తదితరులు పాల్గొన్నారు. సారంగాపూర్ మండలం దుబ్బరాజన్న ఆలయం, బీర్‌పూర్ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. పెగడపల్లిలోని శివాలయంలో మట్టితో తయారు చేసిన 1,016 లింగాలతో వేడుక నిర్వహించారు. రాయికల్ పట్టణంలోని మార్కండేయ ఆలయం, చెన్నకేశవనాథ ఆలయం, శివాలయంలో భక్తులు దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. మల్లాపూర్‌లోని సోమేశ్వరకొండ వద్ద శ్రీకనకసోమేశ్వర ఆలయం, వాల్గొండ శ్రీ రామలింగేశ్వర ఆలయంలో లక్ష దీపోత్సవం ఘనంగా నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment