గ్రూప్–3 తొలిరోజు ప్రశాంతం
జగిత్యాలటౌన్/జగిత్యాలక్రైం: గ్రూప్–3 పరీక్ష జిల్లాలో తొలిరోజు ప్రశాంతంగా ముగిసింది. 34 కేంద్రాల్లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30వరకు మొదటి, మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం 5.30వరకు రెండోపరీక్ష నిర్వహించారు. ఆరు రూట్లలో 11మంది ఫ్‌లైయింగ్ స్క్వాడ్స్, 13మంది ఐండెంటిఫికేషన్ అధికారులు, 82మంది బయోమెట్రిక్ అధికారులు, 34మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 34మంది అబ్జర్వర్లు, 34మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు పర్యవేక్షించారు. ఎన్‌ఎస్‌వీ డిగ్రీ కళాశాల, నలంద కళాశాల, ఎస్‌కేఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాలను కలెక్టర్ సత్యప్రసాద్ తనిఖీ చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ రఘుచందర్ కొత్త బస్టాండ్, అంతర్గాం బైపాస్ చౌరస్తా ప్రధాన కూడళ్ల వద్ద పోలీసు హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. వికలాంగ, మహిళాఅభ్యర్థుల కోసం ఆటోలు ఏర్పాటు చేశారు. 10,656 అభ్యర్థులకు మొదటి పరీక్షకు 5,544 మంది, మధ్యాహ్నం పరీక్షకు 5,563 మంది హాజరయ్యారు. అన్ని రూట్లలో వాహనాలు ఏర్పాటు చేసి అభ్యర్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా చర్యలు చేపట్టామని డీఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment