జాగ్రత్తలు తీసుకోవాలి
జగిత్యాల: ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. సాయంత్రం 4 గంటల నుంచే శీతలగాలులు వీస్తున్నాయి. ఉదయం 9 దాటినా వణుకు తగ్గడం లేదు. చిన్నారులు, వృద్ధులు, మహిళలు, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు ఇళ్ల నుంచి బయటకు రావద్దు.
● చల్లని పదార్థాలు, నీరు, పానియాలు, బయటి పదార్థాలకు దూరంగా ఉండాలి.
● చిన్నారులు, బాలింతలు, గర్భిణులు, వృద్ధులు మంకీక్యాప్‌లు, స్వెట్టర్లు ధరించాలి.
● వాకింగ్‌కు వెళ్లే వారు, ద్విచక్రవాహనదారులు చేతులకు గ్లౌస్‌లు, కాళ్లకు సాక్స్‌లు, బూట్లు ధరించాలి.
● వీలైనంత వరకు ఉదయం 9 గంటల తర్వాత.. సాయంత్రం 5 గంటలలోపు పనులు ముగించుకోవాలి
● చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. న్యూమోనియా, అస్తమా రాకుండా ఉండేందుకు గాలి వీస్తున్నప్పుడు తిరగకపోవడం, దుమ్ము, దూళి ఉండే పరిసరాలు, రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి.
– డీసీజేఎస్ ప్రోగ్రాం అధికారి, డాక్టర్ అర్చన, జగిత్యాల
Comments
Please login to add a commentAdd a comment