శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గరుడ కల్యాణం
రాయికల్: రాయికల్ పట్టణంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం హోమం, గరుడ కల్యాణాన్ని అర్చకులు రాంగోపాలాచారి, కల్యాణ్‌కృష్ణ, రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున హోమంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం
జగిత్యాల: విద్యార్థుల ప్రాణాలతో అధికారులు చెలగాటం ఆడుతున్నారని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజినీకాంత్ అన్నారు. పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఇన్ని సంఘటనలు జరి గినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులు విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పర్యటించినా.. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
గురుకులాలను గాలికొదిలేసిన ప్రభుత్వం
● జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత
జగిత్యాల: గురుకులాలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. గురుకులం విద్యార్థులు పాముకాటు బారిన పడుతున్నా.. పట్టించుకోవడం లేదన్నారు. ఇద్దరు విద్యార్థులు పాముకాటుకు గురైతే ప్రభుత్వంలో చలనం లేదన్నా రు. ఇప్పటికే ఇద్దరు విద్యార్థులు చనిపోయార ని, అది ముమ్మాటికీ అధికారుల నిర్లక్ష్యంతోనేనని వెల్లడించారు. విద్యార్థులను కలిసేందుకు వెళ్తున్న బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావును అడ్డుకుని అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు. ఎన్ని అరెస్ట్‌లు చేసినా బీఆర్‌ఎస్ నాయకులు భయపడబోరని హెచ్చరించారు.
నేడు ఆర్టీసీ డయల్ యువర్ డీఎం
జగిత్యాలటౌన్/మెట్‌పల్లి: ప్రయాణికుల సమస్యలు తెలుసుకుని వారి అభిప్రాయాలకు అనుగుణంగా మరింత మెరుగైన సేవలు అందించేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జగిత్యాల డిపో మేనేజర్ సునీత, మెట్‌పల్లి డీఎం దేవరాజ్ తెలిపారు. జగిత్యాల డిపో మేనేజర్ శుక్రవారం ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 99592 25925 నంబర్‌లో అందుబాటులో ఉంటారు. మెట్‌పల్లి డిపో మేనేజర్ సాయంత్రం 4గంటల నుంచి 5గంటల వరకు 99592 25927 నంబర్‌లో అందుబాటులో ఉంటారు. ప్రయాణికులు తమ అభిప్రాయాలు తెలపాలని మేనేజర్లు సూచించారు.
దరఖాస్తులు ఆహ్వానం
జగిత్యాల: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని ఏఆర్‌టీ సెంటర్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేసేందుకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సూపరింటెండెంట్ రాములు తెలిపారు. మెడికల్ ఆఫీసర్ పోస్టు ఖాళీగా ఉందని, ఎంబీబీఎస్ ఉండి 62ఏళ్లు మించకుండా.. హెచ్‌ఐవీ ఫీల్డ్‌లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుందని, దరఖాస్తులను ఈనెల 20 నుంచి 26 వరకు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలోని ఏఆర్‌టీ సెంటర్‌లో ధ్రువీకరణ పత్రాలతో సమర్పించాలని, ఈనెల 27న జనరల్ ఆస్పత్రిలోనే ఇంటర్వ్యూ ఉంటుందని పేర్కొన్నారు.
కక్షలతో సాధించేదేమీ లేదు
జగిత్యాలజోన్: కక్షలతో సాధించేదేమీ లేదని జిల్లా న్యాయసేవ సంస్థ కార్యదర్శి ప్రసాద్ అన్నారు. జగిత్యాల స్పెషల్ సబ్‌జైలును గురువారం సందర్శించి ఖైదీలకు అందుతున్న సదుపాయాలను అడి గి తెలుసుకున్నారు. చిన్నచిన్న సమస్యలకు కోర్టులు, పోలీస్‌స్టేషన్ల మెట్లు ఎక్కడం ద్వారా మానసిక ప్రశాంతత కోల్పోతారని, నేరాలు చేసి జైలుకు వస్తే వారి కుటుంబాలు చిన్నభిన్నమవుతాయని పేర్కొన్నారు. నేరమయ జీవితానికి దూరంగా ఉండాలని సూచించారు. ఖైదీలకు అందుతున్న బోజన వసతి, వైద్య సదుపాయాలు అడి గి తెలుసుకున్నారు. డెప్యూటీ చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ పొట్టవత్తిని సతీశ్, జైలర్ మొగిలేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment