విద్యార్థుల ఆరోగ్య సంరక్షణే ధ్యేయం
జగిత్యాల: ప్రతి విద్యార్థి ఆరోగ్య సంరక్షణే ప్రధాన ధ్యేయమని, గురుకులం విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకులం విద్యార్థులు ఓంకార్ అఖిల్, బోడ యశ్విత్ అస్వస్థతకు గురికాగా.. మెట్‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్‌తో కలిసి పాఠశాలను గురువారం సందర్శించారు. గురుకులం పాఠశాల ఆవరణ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పాములు ఉంటే వెంటనే పట్టేవారిని పిలిపించి పట్టించాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి అపాయమూ రాకుండా చూసుకోవాలని, అలాగే పాముకాటు నివారణ చర్యలపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. చుట్టూ పరిసర ప్రాంతాలను పరిశీలించి పొదలు, చెట్లు పెరగకుండా పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల వద్ద శుభ్రత పాటించడంతోపాటు, కిటికీలకు నెట్లు ఏర్పాటు
చేయాలని ఆదేశించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే హాస్టల్ ఆవరణలోకి పాములు రాకుండా ఉంటాయని, పాముకాటుకు గురైతే తప్పించుకునే మార్గాలు, ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఆయన వెంట డీఎంహెచ్‌వో ప్రమోద్, డెప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాస్, ఎంపీడీవో, అధికారులు పాల్గొన్నారు.
తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు
పరిసరాలను శుభ్రంగా ఉంచండి
పాములుంటే వెంటనే పట్టించండి
విద్యార్థులకు ఎలాంటి అపాయమూ రాకూడదు
అధికారులను ఆదేశించిన కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment