ఘనులు
గణితంలో
● నూతన ఆవిష్కరణల వైపు అడుగులు
● మ్యాథ్స్‌లో ప్రతిభ చాటుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు
● ఎగ్జిబిట్లతో అదరగొట్టిన స్టూడెంట్స్
● నేడు జాతీయ గణిత దినోత్సవం
గణితంలో ఎలాంటి లెక్కనైనా చటుక్కున తేల్చేస్తున్నారు. ఎక్కడ పోటీలు జరిగినా ప్రత్యేకత చాటుతున్నారు. టీచర్ల పర్యవేక్షణలో తర్ఫీదు పొందుతూ చకాచకా లెక్కలు చేసేస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం.. ఉపాధ్యాయుల సలహాలతో టాలెంట్ టెస్ట్.. మేథమెటిక్స్ ఒలింపియాడ్ పోటీల్లో ప్రతిభ చూపుతూ రాణిస్తున్నారు. పలువురు గణిత ఉపాధ్యాయులు సైతం సబ్జెక్టు బోధనలో వినూత్నంగా ఆలోచన చేస్తూ.. సరికొత్త పరిశోధనలు ఆవిష్కరి స్తున్నారు. నేడు శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని గణిత ఘనుల గురించి ‘సాక్షి’ స్పెషల్ స్టోరీ.!!
రాష్ట్రస్థాయి సెమినార్‌లో గణిత ఉపాధ్యాయులు
సప్తగిరికాలనీ(కరీంనగర్): ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా గణిత టీచర్లలో సృజనాత్మకతను వెలికితీసేందుకు శనివారం హైదరాబాద్‌లోని ఎస్‌సీఈఆర్‌టీ ఆడిటోరియంలో స్టేట్ లెవెల్ మ్యాథమేటిక్స్ సెమినార్ నిర్వహించారు. దీనికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి అడిగొప్పుల సదయ్య, జెడ్పీహెచ్‌ఎస్ చింతకుంట(కరీంనగర్), సముద్రాల హరికృష్ణ, బాలికల ఉన్నత పాఠశాల మానకొండూర్(కరీంనగర్), కాయితి అనిత, జెడ్పీహెచ్‌ఎస్ రామగుండం(పెద్దపల్లి), మంతెన వెంకటేశ్ బాబు, జెడ్పీహెచ్‌ఎస్ వెంకేపల్లి (కరీంనగర్), ఎర్రబెల్లి అశోక్, జెడ్పీహెచ్‌ఎస్ సుద్దపల్లి(జగిత్యాల) హాజరయ్యారు. పలు గణిత అంశాలపై పరిశోధన పత్రాలు సమర్పించారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈవీ.నరసింహారెడ్డి చేతులమీదుగా సర్టిఫికెట్ అందుకున్నారు.
సమగ్రంగా నేర్చుకోవాలి
కొత్తపల్లి(కరీంనగర్): గణితం లేని సమాజాన్ని ఊహించలేం. గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ చేసిన సేవలు అనిర్వచనీయం. గణితాన్ని సమగ్రంగా, విశ్లేషణాత్మకంగా నేర్చుకోవడం ద్వారా వివిధ రంగాల్లో విజయం సాధించవచ్చు. – వి.నరేందర్‌రెడ్డి, చైర్మన్,
అల్ఫోర్స్ విద్యాసంస్థలు
Comments
Please login to add a commentAdd a comment