విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి
మెట్‌పల్లిరూరల్: విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, నిర్లక్ష్యం వహించొద్దని మెట్‌పల్లి మండల లీగల్ సర్వీసెస్ చైర్మన్, సబ్‌కోర్టు మేజిస్ట్రేట్ నాగేశ్వర్‌రావు అన్నారు. మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను శనివారం సందర్శించా రు. ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు నిద్రించిన గదిలోకి వెళ్లారు. పడక మంచాలను గోడలకు ఆనించొద్దని, గదుల్లో ఎక్కడా గ్యాప్‌లు ఉండొద్దని సూచించారు. కిచెన్ స్టోర్ రూంలో వంట సామగ్రి, బాత్‌రూమ్స్, రిజిస్టర్‌ల నిర్వహణ తదితరాలను పరిశీలించారు. నాణ్యత లేని ఆహర పదార్థాలు, కూరగాయలు తిరిగి పంపించినట్లు రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. విద్యార్థులు సమస్యలు తెలిపేందుకు ఫిర్యాదుల బాక్స్ పెట్టాలని పేర్కొన్నారు. గురుకులంలోని సమస్యలను జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి నివేదించనున్నట్లు వివరించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లింబాద్రి, న్యాయవాదులు వెంకటనర్సయ్య, రాంభూపాల్, ప్రవీణ్, ప్రశాంత్, శేషు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment