తరలివచ్చిన బాధితులు
● అర్జీలు స్వీకరించిన కలెక్టర్● 32 దరఖాస్తులు రాక
● సమస్యల పరిష్కారానికి ఆదేశాలు
జగిత్యాలటౌన్:కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో బాధితుల నుంచి కలెక్టర్ సత్యప్రసాద్ అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై 32 ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు బీఎస్.లత, గౌతంరెడ్డి, జగిత్యాల, కోరుట్ల ఆర్డీవోలు పులి మధుసూదన్గౌడ్, జివాకర్రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment