చకచకా నృసింహుడి ఆలయ మండప నిర్మాణం
సారంగాపూర్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన బీర్‌పూర్ శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ మండప నిర్మాణం పనులు చురుకుగా సాగుతున్నాయి. 500 ఏళ్ల క్రితం నిర్మాణమైన ఈ ఆలయాన్ని అభివృద్ధి పర్చడానికి గత ప్రభుత్వ హయాంలో శ్రీకారం చుట్టారు. 2015–16లో అప్పటి ఎంపీ కల్వకుంట్ల కవిత మన ఊరు–మన ఎంపీ కార్యక్రమంలో బీర్‌పూర్ గ్రామాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ఆలయ అభివృద్ధికి తనవంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. దేవాదాయశాఖ నుంచి రూ.32 లక్షలు మంజూరు చేయించారు. అయితే పలు కారణాలతో పనులు చేపట్టడంలో తీవ్ర జాప్యమైంది. ఆర్నెళ్ల క్రితం పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం వేగం అందుకున్నాయి. మండప నిర్మాణానికి అదనంగా మరో రూ.35లక్షల వరకు వ్యయం అయ్యేలా ఉందని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. దాతల నుంచి ఆ నిధులు సమకూర్చాలని నిర్ణయించారు. ఫిబ్రవరిలో స్వామివారి బ్రహ్మోత్సవాలు, జాతర వరకు పనులు పూర్తి చేయాలని అధికారులు సంకల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment