ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తాం
జగిత్యాలటౌన్: బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జోనల్ విధానం లోపభూయిష్టంగా ఉందని, ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన జోనల్ వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేస్తామని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. డెమొక్రటిక్ టీచర్స్ యూనియన్ రూపొందించిన క్యాలెండర్‌ను బుధవారం జిల్లాకేంద్రంలో ఆవిష్కరించారు. పాత పది జిల్లాల పరిధిలో పది జోన్లను ఏర్పాటు చేయడం ద్వారా ఉద్యోగ, ఉపాధ్యాయులకు 317 జీవో గొడ్డలిపెట్టుగా మారిందని, ఆ సమస్య పరిష్కరించాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. ఖాళీల మేరకు ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అనంతరం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యలో రూపొందించిన క్యాలెండర్ ఆవిష్కరించారు. నాయకులు గాజుల రాజేందర్, ముఖేష్‌ఖన్నా, రఘువీర్‌గౌడ్, దుర్గయ్య, రేపల్లె హరికృష్ణ, డీటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment